Monday, April 20, 2009

Best Prayer for IT People . . .

Recently I met my friends who are working for various IT companies. After a long chat we together sat for dinner. One of my best pal has reminded the same scene from the movie "Nuvvu Naaku Nachhav" and he started to pry for god. It follows like this . . . (It is in Telugu Language. I'm sorry for those who are not comfortable with Telugu).


దేవుడా మంచి దేవుడా
కాస్ట్ కటింగు పేరు చెప్పి
కుబేరుడి లాంటి ఐటి ని కుచేలుగా చేశావు
కిన్ లే వాటర్ కాస్తా కుండ నీళ్ళు గా మార్చావు
తాగడానికి డ్రింకులు తినడానికి బర్గరు లేకుండా చేశావు
సుఖమైన క్యాబ్ ప్రయాణాన్ని నిలిపివేయించావు
వీకెండు పార్టీలు లేవు. డిస్కోతెక్ లు లేవు
హౌస్ లోన్ లు లేవు - పర్సనల్ లోన్ లు లేవు
ఎప్పుడూ వెంటపడే బ్యాంకు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలీదు
ఎప్పుడూ ఏమి తీసేస్తారో తెలీదు
ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు
ప్రశాంతమైన జీవితాన్ని ఒక ప్రశ్నలాగా మార్చావు
చివరికి ఐటి వాళ్ళకి పిల్లని ఇవ్వాలన్నా భయపడేలా చేశావు
కొత్త సంవత్సరంలోనైనా
ఉన్న పళ్ళు వూడిపోయేలగా కాకుండా
ఉన్న ఉద్యోగం నిలబడేలాగా - ఇస్తున్న జీతం ఇచ్చేలాగా
మాకు కూడా పెళ్లి అయ్యేలాగా చూస్తావని
కాస్ట్ కటింగు అనేది ఐటి వాళ్ల జీవితంలో మరియు జీతంలో లేకుండా చేస్తావని ఆశిస్తున్నాను
నాకు తెలుసు నువ్వు చేస్తావని
ఎందుకంటే బేసికల్ గా యువార్ గాడ్ ,గుడ్ గాడ్ . . .

No comments: